జాతీయస్థాయిలో రన్నరప్‌గా బాలురు ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పరిశీలన గృహం, ప్రత్యేక గహాలలో ఉన్న బాలురకు నయి దిశా సామాజిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆన్లైన్ చెస్ పోటీలలో తిరుపతి ప్రభుత్వ పరిశీలన గృహం బాలురు రన్నరప్ గా నిలిచారని పర్యవేక్షణ అధికారులు షణ్ముఖి రావు, త్రినాథ్ రావు, శరత్ బాబు తెలిపారు. శుక్రవారం మంగళం పరిధిలోని ప్రభుత్వ పరిశీలన గృహంలో ఆన్లైన్ ద్వారా జరిపే ఈ చెస్ పోటీలను పర్యవేక్షించడానికి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆర్బిటర్ మల్లికార్జున్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరపు నుండి తిమ్మప్పను నియమించారు. ఆన్లైన్ చెస్ పోటీలలో ప్రభుత్వ బాలుర పరిశీలన గహం టీమ్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రన్నరప్ గా నిలిచారు. ఈ సందర్భంగా బాలుర టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ఇన్స్ పెక్టర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా ప్రొబేషన్ అధికారి లక్ష్మీపతి, ఉప పర్యవేక్షణ అధికారి శ్రీధర్, మోహన్ పాల్గొన్నారు.
