ప్రజాశక్తి – ఆచంట
రేషన్ షాపుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తహశీల్దార్ జి.కనకరాజు హెచ్చరించారు. మండలంలోని పలు రేషన్ దుకాణాలను, ఎండియు వాహనాలను తహశీల్దార్ కనకరాజు, సివిల్ సప్లరు డిటి దేవి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ పంపిణీపై లబ్ధిదారులను ఆరా తీశారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ ఎండియు వాహనదారులు సక్రమంగా రేషన్ పంపిణీ చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల వద్ద ధరల పట్టికలు, రేషన్ దుకాణాల్లో స్టాకు తనిఖీ చేశారు.మొగల్తూరు : మొగల్తూరులోని చౌక డిపో దుకాణాన్ని, బియ్యం రవాణా వాహనాన్ని మంగళవారం రాత్రి తహశీల్దార్ రాజకిషోర్ తనిఖీ చేశారు. గ్రామంలోని పదో నంబర్ దుకాణాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.