నియామక పత్రాలను అందజేస్తున్న జెడ్‌పి చైర్‌పర్సన్ విజయ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జెడ్‌పి యాజమాన్యం పరిధిలో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు సామాజిక భద్రతలో భాగంగా కారుణ్య నియామకాలు చేపట్టారు. నియామక పత్రాలను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ బుధవారం అందజేశారు. సరుబుజ్జిలి మండల పరిషత్ కార్యాలయంలో పాలక దమయంతి, జెడ్‌పి కార్యాలయంలో మక్క అప్పలనాయుడు, జెడ్‌పి హైస్కూల్ కొలిగాంలో లండ కోటేశ్వరరావును నియమించినట్లు జెడ్‌పి సిఇఒ శ్రీధర్ రాజా తెలిపారు. బాధ్యతాయుతంగా పనిచేయాలని చైర్‌పర్సన్ సూచించారు. కార్యక్రమంలో జెడ్‌పి పరిపాలనాధికారి రమేష్, ఉద్యోగ సంఘ నాయకులు దుంపల అప్పన్న, మిశ్రా తదితరులు పాల్గొన్నారు.