తాగునీటి సమస్యపై సిపిఎం ఆందోళన

ఆందోళన చేస్తున్ననాయకులు, మహిళలు

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని నాన్‌ షెడ్యూల్‌ గరుగుబిల్లి పంచాయతీ పరిధి పైడిపర్తి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని, బోరు మరమ్మత్తు పనులు చేపట్టి తాగునీరు అందించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం మండల నాయకులు జేష్ట వెంకటరమణ, ఆర్‌.శ్రీనులు మాట్లాడుతూ,గ్రామస్తులు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని, దీంతో, కిలో మీటర్‌ దూరంలో ఉన్న కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.తక్షణమే పంచాయితీ. అధికారులు బోరు మరమ్మతు పనులు చేపట్టి తాగునీటిని సరఫరా చేయాలన్నారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి మండల కేంద్రంలో అందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

➡️