ప్రజాశక్తి-బి.కొత్తకోట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హార్సిలీహిల్స్‌ను పర్యాటకంగా అభివద్ధి చేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. హార్సిలీహిల్స్‌లో పర్యాటకరంగ అభివద్ధి నిమిత్తం తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా హార్సిలీహిల్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హార్సిలీహిల్స్‌లో అడ్వంచర్ టూరిజం, ట్రెకింగ్, క్లాంపింగ్ అన్నిటికి అనుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఒబెరారు సంస్థ ప్రతినిధులు ఇక్కడికి విచ్చేశారని చెప్పారు. ఇక్కడ అన్ని రకాల వసతులు వారికి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చూపుతున్న చొరవ, సహకారం పట్ల వారు సంతప్తి వ్యక్తం చేశారు. ఒబెరారు సంస్థ బోర్డు సమావేశంలో చర్చించి రాబోయే రెండు నెలల్లో ఇక్కడ నిర్మాణాలు ప్రారంభించాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. ఇందుకు జిల్లా యంత్రాంగం దగ్గర ఉండి అన్ని రకాలుగా వారికి పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వారు ప్రణాళికలు వేసుకొని ముందుకు వస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని పేర్కొన్నారు. హార్సిలీహిల్స్‌లో చక్కగా పర్యాటకం అభివద్ధి చెందడానికి, అనుబంధ రంగాల ఆదాయం వద్ధి, ఉపాధి పెరగడానికి ఇక్కడ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. హార్సిలీహిల్స్‌తో పాటు ఒక సర్క్యూట్ టూరిజం కూడా అభివద్ధి చెందే అవకాశం ఉందన్నారు. గుర్రంకొండ కోట, వెలిగల్లు రిజర్వాయర్, రాజంపేట తాళ్లపాక అన్నమాచార్యలను కలుపుతూ అటు తిరుపతి ఇటు బెంగళూరు ఇటుపక్క కడపను కలుపుతూ ఒక సర్క్యూట్ ఏర్పాటు చేసుకొని పర్యాటకం అభివద్ధి చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సూచనలు చేసి ఒబెరారు గ్రూపు ద్వారా త్వరగా ఇక్కడ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోమని ఆదేశించారనిమ పేర్కొన్నారు. అందువల్లే ఉన్నత అధికారులతో కలిసి సందర్శించామని తెలిపారు. ఒబెరారు సంస్థ దశలవారీగా రూ.200 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. హెలిపాడ్ సర్వీస్ పెట్టేందుకు గల అవకాశాలను కూడా వారు పరిశీలిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. తిరుపతి, బెంగళూరుకు వచ్చిన వివిఐపిలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందనేది వారి ఆలోచనని, ఇక్కడ ఏ విధంగా అభివద్ధి చేయాలనే అంశంలో వారి సంస్థ ఆర్కిటెక్ట్ కూడా హార్సీలీహిల్స్‌కు వచ్చి పరిశీలించి వెళ్ళారని పేర్కొన్నారు. నీటి సమస్యను అధిగమించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం ఓబెరారు ప్రతినిధులు శంకర్, వినోద్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమకట్టడాలపై ఉక్కుపాదం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో భూకబ్జాలు, అక్రమ కట్టడాలను చేపట్టిన అక్రమార్కులకు కొరడా జులుపిస్తామని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. 150 ఎకరాలు మాత్రమే భూభాగం ఉందని అందులో మొత్తం అభివద్ధి చేసే విధంగానే వ్యవహరిస్తామని తెలిపారు. ఎవరైనా సరే అక్రమ అక్రమాలకు పాల్పడితే పాల్పడినట్టు తెలిసిన ఉపేక్షించబోమని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొద్ది రోజుల్లో సమగ్ర విచారణ జరిపి అక్రమ కట్టడాలపై కబ్జాదారులపై తగుచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అందులోనూ హార్సిలీహిల్స్‌లో ఎలాంటి అక్రమాలకు తావులేదని హెచ్చరించారు.
