పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది

పొన్నూరు: సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని సోమవారం జరగనున్న పోలింగ్‌ ప్రక్రి యలో ఓటర్లు తమ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకున్నందుకు పోలింగ్‌ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. స్థానిక సెయింట్‌ ఆన్స్‌ హై స్కూల్‌ లో పం పిణీ కేంద్రాల నుంచి సెక్టార్లవారీగా పోలింగ్‌ సామాగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది ప్రత్యేక వాహనాల ద్వారా తరలి వెళ్లారు. పోలింగ్‌ కేంద్రాలలో ఉద యం ఐదున్నర గంటలకు ఏజెంట్ల సమ క్షంలో మాక్‌ పోలింగ్‌ జరుగుతుందని పొన్నూరు సెగ్మెంట్‌ రిటర్నింగ్‌ అధికారి లక్ష్మీ కుమారి విలేకరులకు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. 264 పోలింగ్‌ కేంద్రాలకు 27 సెక్టార్లను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా తరలించినట్లు చెప్పారు. పొన్నూరు నియోజకవర్గం ఓటర్లు 2,27,135 తమ ఓటు హక్కును వినియో గించుకోనున్నట్లు చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించు కునేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్‌ ప్రశాంతం జరిగేలా ప్రజలు సహకరించా లని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, హోమ్‌ ఓట్లు ప్రక్రియ పూర్త యిందని అన్నారు.

59 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

చేబ్రోలు: పార్లమెంట్‌,అసెంబ్లీ ఎన్నికల కోసం మండల వ్యాప్తంగా 71 పోలింగ్‌ స్టేషన్లను సిద్ధం చేసినట్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కె.జ్యోతి చెప్పారు. ఆదివారం మండలంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు అందరూ ఎన్నికల సెక్టార్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్లు పోలింగ్‌ సిబ్బందిని పంపినట్లు తెలిపారు. పోలింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌, సంబంధిత అధికారులు ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన కూలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. మండలంలో మొత్తం 71 పోలింగ్‌ కేంద్రాల్లో 59 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ పోలింగ్‌ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు చేశామన్నారు. మండల వ్యాప్తంగా 900 నుండి 1000 మంది వరకు ఎన్నికల విధుల నిర్వహణలో ఉన్నట్లు చెప్పారు.

వర్షం కారణంగా ఏర్పాట్లకు అంతరాయం

తుళ్లూరు : మండలంలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. స్థానిక కెవిఆర్‌ జడ్పీ హైస్కూల్‌, బాపూజీ ఎంపిపి స్కూల్‌ తో పాటు మండలపరిధిలో పలు పాఠశాల భవనాలలో పోలింగ్‌ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. కెవిఆర్‌ జడ్పీ హైస్కూల్లో ఏర్పాట్లను జూనియర్‌ అ సిస్టెంట్‌ (పిఎస్‌- 26) బిఎల్‌ఒ శ్రీవిద్య ఆదివారం పరిశీలించారు. వర్షం కారణంగా ఏర్పాట్లకు అంతరాయం కలుగుతోందని చెప్పారు. మండల పరిధిలోని దొండపాడు, బోరుపాలెం,వడ్డమాను పెదపరిమి, శాఖ మూరు, ఐనవోలు,లింగాయపాలెం తది తర గ్రామాల్లో ఏర్పాట్లు దాదాపు పూర్త యినట్లు అధికారులు తెలిపారు.

66 పోలింగ్‌ కేంద్రాలు

తాడికొండ: మండలంలోని 15 గ్రామాలలో 57 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 66 పోలింగ్‌ బూత్‌లను సిద్ధం చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయం కాలా నికి ఈవీఎంలతో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పోలీసులు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టిి సారించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొబైల్‌ పార్టీలు గస్తీ నిర్వహించిన వారి కళ్ళు గప్పి డబ్బు మద్యం పంపిణీ జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు తమ ఓటు హక్కును వినియోగించు కోవ డానికి సొంత గ్రామాలకు చేరుకున్నారు.

వికలాంగుల కోసం వీల్‌చైర్లు

ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గం మొత్తం మీద 288 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు ప్రత్తి పాడు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ శ్రీ కార్‌ తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో బారికేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వికలాంగుల సౌలభ్యం కోసం వీల్‌ చైర్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. పోలింగ్‌ కేం ద్రాల్లో టెంట్లు ,కుర్చీలు, తాగునీరు సదు పాయాలు ఏర్పాటు చేశామన్నారు.

కట్టుదిట్టంగా ఏర్పాట్లు

తెనాలి: పోలింగ్‌ కేంద్రాలకూ పోలింగ్‌ సిబ్బంది చేరుకున్నారు. పట్టణ, రూరల్‌ గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ లో తోపులాట లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఐతానగర్‌ ఎర్ర బడి వద్ద కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను ఆ కేంద్రానికి కేటాయించిన పోలింగ్‌ అధికారి పరిశీలించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

➡️