ఐటిడిఎస్‌ ఆధ్వర్యంలో 42 మందికి కంటి ఆపరేషన్లు

ప్రజాశక్తి – పోలవరం
మండలంలో కంటి సమస్యలతో బాధపడుతున్న 42 మందికి ఐటిడిఎస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రాజమహేంద్రవరం గౌతమి నేత్రాలయ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన మండలంలోని చేగొండపల్లిలో ఐటిడిఎస్‌ ఆధ్వర్యంలో ఒఎన్‌జిసి సౌజన్యంతో గౌతమి నేత్రాలయ వైద్య బృందంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించినట్లు ఐటిడిఎస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ గంగు అనిల్‌కుమార్‌ తెలిపారు. వారిని శిబిరం నిర్వహించిన ప్రాంతం నుంచి గౌతమి నేత్రాలయ వాహనంలో రాజమహేంద్రవరం తరలించి ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్‌ అనంతరం వారికి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు అందించారు.

➡️