accident : యుపిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు వైద్యులు మృతి

లక్నో :  ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. స్కార్పియో ఎస్‌యువి ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వైద్యులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరంతా యుపిలోని  సైఫాయ్‌లో  యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో పిజి శిక్షణ పొందారు. లక్నోలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని  ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టింది.  ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐదుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరొకరు తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతున్నారని అన్నారు.  డ్రైవర్‌ నిద్రమత్తుతో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. మృతులను డా. అనిరుధ్‌ వర్మ, డా.సంతోష్‌ కుమార్‌ మౌర్య, డా. జైవీర్‌ సింగ్‌, డా. అరుణ్‌ కుమార్‌ మరియు డా. నార్దేవ్‌లుగా గుర్తించారు.

➡️