కాశిరాళ్ల ప్రభుత్వ పాఠశాలకు…. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారం…

Nov 4,2024 00:21
కాశిరాళ్ల ప్రభుత్వ పాఠశాలకు.... ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారం...

శ్రీ రూ.50లక్షలతో అభివద్ధి పనులు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సహకారంతో యాదమరి మండలంలోని కాశిరాళ్ల కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో రూ.50లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పినకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చేయూతనందించిందని కళాశాల ప్రిన్సిపాల్‌ లలిత తెలిపారు. ప్రజాశక్తి- యాదమరిసుమారు రూ.50లక్షల రూపాయల వ్యయంతో పాఠశాల ఆవరణంలో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషియన్‌ కింద వంట గది, డైనింగ్‌ హల్‌, బాలికలకు మరుగుదొడ్లు, వాలీ బాల్‌ కోర్టు, షటిల్‌ కోర్టు నిర్మించారు. డైనింగ్‌ హాల్‌లో ఒకేసారి 300 మంది విద్యార్థులు భోజనాలు చేసేలా ఏర్పాటు చేశారు. గతంలోనూ స్వచ్చత పక్వాడలో భాగంగా సుమారు 15 చెత్త బుట్టలు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా జామ, కొబ్బరి, టేకు, మామిడి వంటి పదిరకాల మొక్కలను కూడా ఐఓసిఎల్‌ పాఠశాలకు అందించారు. అలాగే పాఠశాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, ఆటల పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ఐఓసిఎల్‌ అధికారులు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందిస్తూ ప్రోత్సహించేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వబడులలోని విద్యార్థులు ఎంతో చక్కగా మంచి నైపుణ్యాలతో, క్రమశిక్షణ కలిగి ఉన్నారని వారు ప్రశంసించారు. అనతికాలంలోనే మహిళ ప్రధానోపాధ్యారాయులుగా ఎపి.లలిత పాఠశాలను అభివధ్ధి పథంలో నడిపించారని తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు. పాఠశాల ఆవరణంలో ప్రిన్సిపల్‌ లలిత సహకారంతో రూ.1.5లక్షల వ్యయంతో సరస్వతిదేవి మందిరం నిర్మించడానికి కషి చేశారు. అలాగే ఉపాద్యాయులు సహకారంతో రూ.70వేలతో విద్యార్థుల కోసం నీటి బోర్‌మోటర్‌ తెప్పించారు. ఈ పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్లు, నిత్యం మంచి చల్లని గాలి, పరిశుభ్రతతో పాఠశాల చూడ ముచ్చట గొలుపుతూ ఉంటుంది. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయ బందం మంచి బోధనా అనుభవం కలిగిన సీనియర్‌ ఉపాధ్యాయులే ఉన్నారు. పాఠశాల సుమారుగా 430 విద్యార్థులతో కళకళ లాడుతుంటుంది. ఐఓసిఎల్‌ డిజిఎ అమితాబ్‌ సర్దార్‌, అధికారులు కైలాష్‌ కాంత్‌, అరుణ్‌ ప్రసాద్‌ పాఠశాల అభివృద్ధికి నిత్యం సహకరిస్తు ఉంటారు. జిల్లాలోనే ఈపాఠశాలకు ప్రత్యేకస్థానం కలిగి ఉన్నది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్మించిన నూతన భవనాలను త్వరలో జిల్లా కలెక్టర్‌, ఎమ్మెల్యే, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అధికారులు ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

➡️