ప్రజాశక్తి -యంత్రాంగం మహాత్మా జ్యోతీరావ్ ఫూలే 199వ జయంతిని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక గోదావరి గట్టు సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందని వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతీరావ్ ఫూలే అన్నారు. వెనుకబడిన వర్గాలు, తరగతుల వారు అభివృద్ధి చెందాలంటే విద్య అవసరం చాటిచెప్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే అన్నారు. ఆనాడే ఉచిత విద్యను అందించడమే కాకుండా, ఆయన భార్య ద్వారా స్త్రీ విద్యకు కూడా ప్రోత్సాహం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి సోము వీర్రాజు, రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, ఉన్నతాధికారులు కె.తిలక్ కుమార్, బి.శశాంక, కూడిపూడి సత్తిబాబు, నైనాల కృష్ణారావు, ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావు పాల్గొన్నారు.ఎల్‌ఐసి ఒబిసి అసోసియేషన్ అధ్యర్యంలో ఫూలేకు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ డివిజనల్ మేనేజర్ కె.సంధ్యారాణి మాట్లాడారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, అందరికీ ఉచిత విద్య కోసం ఫూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బి.సురేష్, బి.శ్రీనివాస్, రేఖ, కృష్ణ, విశ్వనాథ్, బొక్కా శ్రీనివాసరావు, మోలేటి రమేష్‌బాబు, శిరీష, భరణి తాతేశ్వర్, ఈశ్వర్, ఎస్.గానయ్య, వీర కిషోర్, ఎం.కోదండరామ్, ఎస్‌ఆర్‌జె.మాథ్యూస్ పాల్గొన్నారు.తాళ్లపూడి జ్యోతీరావు ఫూలే జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాగోలపల్లి పాఠశాల హెచ్‌ఎం దున్నా దుర్గారావు అన్నారు. పాఠశాల ఆవరణలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల సిబ్బంది వరలక్ష్మి, కుమారి పాల్గొన్నారు. చాగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి ఎంపిపి మట్ల వీరాస్వామి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంతో పాటు, పలు గ్రామాల్లో జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. తాడిపర్రు సర్పంచ్ కరుటూరి నరేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.రాజానగరం సూర్యారావుపేట బిసి కాలనీలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు మాట్లాడారు. మాల ఐక్యవేదిక కన్వీనర్ ముప్పిడి శ్రీనివాస్, అఖిలభారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు జనుపల్లి సత్తిబాబు, కోలాటి చినవెంకన్న, మరుకుర్తి వీరలక్ష్మి, బొలిశెట్టి సత్యవతి, దొమ్మ సీత, గోర్స దుర్గ పాల్గొన్నారు.దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కెవికె.దుర్గారావు మాట్లాడారు. ఎంపిడిఒ ఎస్.వేణుగోపాలరెడ్డి, ఎంఇఒ తిరుమల దాస్, ఎఒ శాంతి, పత్స గోపాల్, కమిశెట్టి దుర్గారావు, నిట్ట రవికిషోర్ పాల్గొన్నారు.పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ సిహెచ్.వెంకటరమణ ఆధ్వర్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శంకర్ హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ జోగారావు పాల్గొన్నారు.గోపాలపురం మండలంలో పలుచోట్ల ఫూలే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ బిఎస్‌ఎస్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి టి.శ్రీనివాస్, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఎస్‌బిఐ ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డిగర్ల సువర్ణ రాజు, టిడిపి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు నిర్వహించారు. అనంతరం అదే విగ్రహానికి మాజీ హోమ్ మంత్రి తానేటి వనిత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
