ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తా : ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య

ప్రజాశక్తి – వేటపాలెం
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో కృషి చేస్తానని ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక సజ్జావారివీధిలోని టిడిపి సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య ఇంటికి ఆయన ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు ఆయనను కలిసి సమస్యలు ఏ కరువు పెట్టారు. వృద్ధులు పింఛన్లు ఇప్పించాలని కోరారు. కొంత మంది మహిళలు ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో మాదిరిగా పాలన ఉండదని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ఎలాంటి సమస్యలనైనా నేరుగా తన దృష్టికి తీసుకొని రావాల్సిందిగా కోరారు. తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుత్తి పరమేశ్వరరావు, పిచ్చుక వెంకట సుబ్బారావు, గుత్తి హేమ సుందర్రావు, సజ్జ రమేష్, సజ్జా హరణబాబు, బొడ్డు ముసలయ్య, బొడ్డు శ్రీనివాసరావు, నాసిక వెంకటేశ్వర్లు, నాసిక కోటేశ్వరరావు, గుత్తి నాగభూషణం, ఉమామహేశ్వరరావు, పసుమర్తి రామారావు పాల్గొన్నారు.

➡️