wpl చివరి లీగ్‌లో బెంగళూరు చేతిలో ముంబయి ఓటమి

Mar 11,2025 23:59 #Cricket, #rcb, #WPL
  • ఫైనల్‌కు ఢిల్లీ
  • ముగిసిన డబ్ల్యుపిఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లు

ముంబయి: ఫైనల్‌కు నేరుగా చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాటర్లు నిరాశపరిచారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళలతో మంగళవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ముంబయి జట్టు .. పరుగుల తేడాతో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 10పాయింట్లు (+0.32) రన్‌రేట్‌తో నేరుగా ఫైనల్‌కు చేరగా.. ముంబయి, గుజరాత్‌ జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది.

బ్రాబౌర్న్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల ప్రిమియర్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్‌ మంధాన (53), మేఘ్నా(26), ఫెర్రీ(49నాటౌట్‌), రీచా ఘోష్‌(36), వారేహామ్‌(31) రాణించడంతో బెంగ ళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 199పరుగులు చేసింది. ముంబయి బౌలర్లు మాథ్యూస్‌కు రెండు, అమేలియా కెర్ర్‌కు ఒక వికెట్‌ దక్కాయి. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబ యి జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్ల కోల్పోయి 188పరుగులే చేయగల్గించి. స్కీవర్‌ బ్రంట్‌(69) ఒంటరి పోరాటం మినహా.. మిగిలిన బ్యాటర్లు నిరాశ పరిచారు. హర్మన్‌(20), సజన(23) మాథ్యూస్‌(19), అమన్‌జ్యోత్‌ కౌర్‌(17), సంస్కృతి గుప్తా(10) మాత్రమే రెండంక్కెల స్కోర్‌ చేశారు. బెంగళూరు బౌలర్లు స్నేV్‌ా రాణాకు మూడు, కిమ్‌ గ్రాత్‌, ఎలైసే పెర్రీకి రెండేసి వికెట్లు దక్కాయి.

స్కోర్‌బోర్డు…
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ఇన్నింగ్స్‌: సబ్బినేని మేఘ్నా (సి)సిసోడియా (బి)మాథ్యూస్‌ 26, మంధాన (సి)ఇస్మాయిల్‌ (బి)అమేలియా కెర్ర్‌ 53, ఎలైసే పెర్రీ (నాటౌట్‌) 49, రీచా ఘోష్‌ (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)మాథ్యూస్‌ 36, వారేహామ్‌ (నాటౌట్‌) 31, అదనం 4. (20 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 199పరుగులు. వికెట్ల పతనం: 1/41, 2/100, 3/153

బౌలింగ్‌: ఇస్మాయిల్‌ 4-0-41-0, స్కీవర్‌ బ్రంట్‌ 2-0-16-0, మాథ్యూస్‌ 4-0-37-2, అమన్‌జ్యోత్‌ కౌర్‌ 4-0-27-0, అమేలియా కెర్ర్‌ 3-0-47-1, సంస్కృతి గుప్తా 1-0-6-0, సిసోడియా 2-0-24-0

ముంబయి ఇండియన్స్‌ మహిళల ఇన్నింగ్స్‌: మాథ్యూస్‌ (సి)హీథర్‌ గ్రాహమ్‌ (బి)స్నేహ్ రాణా 19, అమేలియా కెర్ర్‌ (సి)మంధాన (బి) స్నేహ్ రాణా 9, స్కీవర్‌ బ్రంట్‌ (సి అండ్‌ బి)ఎలైసే పెర్రీ 69, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి)రీచా ఘోష్‌ (బి)కిమ్‌ గ్రాత్‌ 20, అమన్‌జ్యోత్‌ కౌర్‌ (బి)గ్రాహమ్‌ 17, యాస్టికా భాటియా (సి అండ్‌ బి)స్నేహ్ రాణా 4, సజీవన్‌ సజన (సి)మేఘ్నా (బి)ఎలైసే పెర్రీ 23, కమిలిని (సి)ఎలైసే పెర్రీ (బి)వారేహామ్‌ 6, సంస్కృతి గుప్తా (సి)జోషిత (బి)కిమ్‌ గ్రాత్‌ 10, ఇస్మాయిల్‌ (నాటౌట్‌) 4, సిసోడియా (నాటౌట్‌) 0, అదనం 7. (20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 188పరుగులు.

వికెట్ల పతనం: 1/27, 2/38, 3/78, 4/129, 5/134, 6/140, 7/152, 8/167, 9/186 బౌలింగ్‌: కిమ్‌ గ్రాత్‌ 4-0-23-2, ఎలైసే పెర్రీ 4-0-53-2, స్నేహ్ రాణా 4-0-26-3, హీథర్‌ గ్రాహామ్‌ 4-0-47-1, వారేహామ్‌ 4-0-29-1.

➡️