కడపలో మొదటి సారిగా ఎపిఎల్‌ సీజన్‌-3 క్రికెట్‌ మ్యాచ్‌లు

ఈనెల 30 నుంచి జూలై 3వ తేదీ వరకు నిర్వహణస్టార్‌ స్పోర్ట్స్‌-1, స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారంమ్యాచ్‌లకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాంతిలకించేందుకు అందరికీ ఉచిత ప్రవేశంజిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం. భరత్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్‌ప్రజాశక్తి – కడప కడపలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో ఏర్పాటుచేసిన ఫెడ్‌లైట్స్‌ కాంతులలో ఈనెల 30 నుంచి జులై 3 వరకు నాలుగు రోజులపాటు ఎన్నడూ లేని విధంగా ఎపిఎల్‌ (ఆంధ్ర ప్రీమియం లీగ్‌) సీజన్‌-3 టి- 20 క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎం. భరత్‌ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్‌ తెలిపారు. ఎపిఎల్‌ సీజన్‌-3 క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రజాశక్తితో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలిపారు. ఎపిఎల్‌ సీజన్‌-1, సీజన్‌-2 మ్యాచ్‌లు గతంలో వైజాగ్‌లో నిర్వహించారని చెప్పారు. ఇప్పుడు ఏపిఎల్‌ సీజన్‌-3 క్రికెట్‌ మ్యాచ్‌లను కడప, వైజాగ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎపిఎల్‌ సీజన్‌ -3 మ్యాచ్‌ల ప్రారంభ కార్యక్రమం ఈనెల 30న కడప లోని వైఎస్‌ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో ఉంటుందన్నారు. ప్రారంభ రోజు ఒక మ్యాచ్‌ ఉంటుందని వారు తెలిపారు. తరువాత జులై 1,2,3 తేదీలలో మూడు రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్‌లు( డే అండ్‌ నైట్‌) ఫెడ్‌ లైట్స్‌ కాంతులలో ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 7 మ్యాచ్‌లు లీగ్‌ పద్ధతిలో జరుగుతాయని వారు తెలిపారు. తర్వాత మ్యాచ్‌లు వైజాగ్‌లో ఉంటాయన్నారు. మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయని చెప్పారు. కోస్టల్‌ రైడర్స్‌, రాయలసీమ కింగ్స్‌, ఉత్తరాంధ్ర లయన్స్‌, బెజవాడ టైగర్స్‌, గోదావరి టైటాన్స్‌, వైజాగ్‌ వారియర్స్‌ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నాయని వివరించారు. మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్‌ స్పోర్ట్స్‌ -1, స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు ఛానళ్లలో వీక్షించవచ్చునన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లను చేసినట్లు వారు తెలిపారు. కడప నగర, జిల్లా ప్రజలకు, క్రికెట్‌ అభిమానులకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించామన్నారు. మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఫెడ్‌ లైట్స్‌ కాంతులలో కడపలోని వైయస్‌ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో ఏపీఎల్‌ సీజన్‌ – 3 మ్యాచ్లు నిర్వహించడం ఓ గొప్ప సువర్ణ అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.

➡️