నేటి నుంచి ఎస్వీయూ తరగతులు ప్రారంభం ప్రజాశక్తి – క్యాంపస్‌: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అకడెమిక్‌ విద్యా సంవత్సరానికి ఆదివారంతో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి తరగతులకు ప్రారంభిస్తున్నట్లు పరిపాలనా భవనం ఉన్నతాధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌ గుర్తించి విభాగాధిపతులకు తెలియజేసి విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. అకడెమిక్‌ క్యాలెండర్‌ను సకాలంలో పూర్తిచేసి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రిన్సిపాల్‌ను తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం దష్ట్యా కళాశాలకి రావాలని హాస్టల్‌ వసతి గహాలను కూడా సోమవారం నాడే ఓపెన్‌ చేయడం జరుగుతుందని, సుదూర ప్రాంతాల నుంచి ఎస్వియూకి చేరుకునే విద్యార్థులు సకాలంలో తరగతులకు హాజరుకావాలని సూచించారు.

Jun 10,2024 00:30

➡️