ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలం, చంద్రవరం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని తలారి వెంకట్రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు జగనన్న కాలనీవాసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దిపాటి శ్రీరామమూర్తి, వైఎస్‌ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు చెల్లింకల దుర్గా మల్లేశ్వరరావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
