ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎస్‌ఐలు బాధ్యతల స్వీకరణ

Apr 13,2025 23:40
బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్‌ఐలు

ప్రజాశక్తి-చింతపల్లి: చింతపల్లి ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఎస్సైలుగా వై చైతన్య, నెల్లి రాంబాబు లు ఆదివారం బాధ్యతల స్వీకరించారు. అల్లూరి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించిన వై చైతన్య, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించిన నెల్లి రాంబాబు ఇద్దరు పదోన్నతి పై చింతపల్లి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి ఎస్సైలుగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,మండలంలోని ఎక్కడైనా నాటు సారా తయారీ, క్రయవిక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

➡️