ప్రజాశక్తి- జమ్మలమడుగు రూరల్ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో అంగనవాడీ వర్కర్స్ యూనియన్ విస్తత సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ కూటమి పభుత్వం ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సమ్మె సందర్భంగా తాము అధికారంలోకి రాగానే అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్‌కు వేతనాలు పెంచలేదన్నారు. పెండింగ్‌లోనే ఉన్న బిల్లులను విడుదల చేయకపోవడం దారుణమని వాపోయారు. దాదాపు రాష్ట్రంలో 5,605 సెంటర్లు మినీ అంగన్వాడీ సెంటర్‌లుగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.హెల్పర్ లేకపోయినా వర్కర్ పని చేస్తున్నారని చెప్పారు. చాలా గ్రామాలలో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆహారాన్ని వండి పెట్టడం, ప్రీస్కూల్ నడపడం వంటి అనేక సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మినీ వర్కర్లు ఆయా ప్రాంతాలలో కూడా లబ్ధిదారులకు ఆహారాన్ని అందిస్తున్న వారి కష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరిని గుర్తించి అంగన్వాడడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీదేవి ఆర్.లక్ష్మీదేవి సిఐటియు కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్ను కున్నారు. అంగన్వాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, లక్ష్మీదేవి, గౌరవాధ్యక్షుడు జి.ఏసుదాసు ఎన్నురకున్నారు. 18 మందితో నూతన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్ర మంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, సిఐటియు అంగ న్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సలీమా, కళావతి వరలక్ష్మి, కుసు మావతమ్మ, పట్టణ కార్యదర్శి దాసరి విజరు, ఉపాధ్యక్షులు ఎ. వినరు కుమార్, విజరు కుమార్, అంగన్వాడడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.