సమస్యలు పరిష్కరించాలని ఎంఎల్‌ఎకు వినతి

ప్రజాశక్తి – తణుకు

పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణకు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పివి.ప్రతాప్‌ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తణుకు ఎంఎల్‌ఎ రాధాకృష్ణను కలిసి పట్టణంలో ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ తణుకు పట్టణంలో మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, సన్న, చిన్నకారు రైతులు, చేతివృత్తిదారులు ఎక్కువగా ఉన్నారన్నారు. పలు గ్రామాల నుండి ఉపాధి కోసం ఈ కాలంలో పట్టణంలోని పరిశ్రమల్లో పని చేసేందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. పట్టణం విస్తరించినప్పటికీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి మాత్రం లేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తణుకు పట్టణాభివృద్ధి నేటీకి జరగలేదన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గార రంగారావు, గుబ్బల గోపి, గణేష్‌, విజరు, వెంకటేశ్వరరావు, బంగారమ్మ, సత్యవతి, శారద తదితరులు పాల్గొన్నారు.

➡️