ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి) : పట్టణంలోని వైష్ణవ కోనేరు చుట్టూ వన్ టౌన్ పోలీసులు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజాశక్తి దినపత్రికలో బుధవారం ‘వైష్ణవ కోనేరు పవిత్రతను కాపాడండి’ అన్న శీర్షికన కథనం వెలువడింది. స్పందించిన వన్ టౌన్ సీఐ గోపి వెంటనే కోనేరు పరిసరాల్లో పార్కింగ్ చేసిన వాహనాలను తొలగించి నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా వాహనాలు పార్కింగ్ చేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.
