దీర్ఘకాలపు భూ సమస్యలను శిరాక్షరాలతో తెల్లకాగితంపై లిఖించి.. ఏళ్లనాటి నుంచి మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని సమస్యలను మళ్లీ.. మరో కాగితంపై రాసుకొని.. పరిష్కారం అవుతుందన్న కాంక్ష.. అధికారులు స్పందిస్తారన్న ఆఖరి ఆశతో రెవెన్యూ సదస్సులు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అయ్యా.. మా భూ సమస్య ఇదీ నాడు.. తహశీల్దార్ ఆఫీస్‌కి వచ్చాం.. మొన్నటిమొన్న కలెక్టరేట్‌లోనూ విన్నవించాం.. అయినా సమస్య అలానే ఉంది.. ఇప్పటికైనా పరిష్కారం చూపండి మహాప్రభో అంటూ సదస్సు వద్ద అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.
శ్రీ సదస్సుల్లో వినతుల వెల్లువశ్రీ దీర్ఘకాల సమస్యలే అధికంశ్రీ అధికారుల చెంత ప్రజల మొరశ్రీ బుట్టదాఖలు చేయొద్దని వేడుకోలుశ్రీ అర్థవంతమైన పరిష్కారం చూపుతామన్న అధికారులుభూ సమస్యల పరిష్కారానికే ‘రెవెన్యూ సదస్సులు’శ్రీ వినతులు స్వీకరించిన ప్రభుత్వ విప్, కలెక్టర్, కడా పీడీప్రజాశక్తి-రామకుప్పం: రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ యజమానులకు భూ హక్కుపై భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడా పిడి వికాస్ మరమత్ పేర్కొన్నారు. శుక్రవారం రామకుప్పం మండలం గొరివిమాకులపల్లె గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. ప్రజల వద్ద నుంచి కలెక్టర్ నేరుగా వినతులు స్వీకరించారు. భూ సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కుప్పం ఆర్‌డీవో శ్రీనివాస రాజు, తహశీల్దార్ బాబు, డాక్టర్ సురేష్, మున స్వామి, ఆనంద రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.జవాబుదారిగా ఉండాలి: జెసిప్రజాశక్తి-యాదమరి: రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చే ప్రతి వినతికి జవాబుదారీతనంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. శుక్రవారం యాదమరి మండల పరిధిలోని కుక్కలపల్లి గ్రామ సచివాలయం పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. రెవిన్యూ సదస్సుకు వచ్చిన రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో యాదమరి తహశీల్దార్ పార్థసారథి, డిప్యూటీ తహశీల్దార్ జయంతి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వీఆర్వోలు, సచివాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యేప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులతో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. మండలంలోని బేలుపల్లి పంచాయతీ కేంద్రంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించగా ఎమ్మెల్యే హాజరైయ్యారు. ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన అన్నారు. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తహశీల్దార్ మాధవరాజు ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పలమనేరు ఆర్డివో భవాని, నాయకులు కిషోర్ గౌడ, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి తదితరులు పాల్గొన్నారు.ప్రజాశక్తి-రొంపిచర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సుకు రొంపిచర్ల మండల తహసీల్దారు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బిసి కార్పొరేషన్ డైరెక్టర్, రొంపిచర్ల మండల అధ్యక్షులు ఉయ్యాల రమణ పాల్గొన్నారు. అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్ డిటి లోకేష్, ఆర్‌ఐ సుధాకర్ నాయక్, వీఆర్వో సురేంద్ర, సీనియర్ అసిస్టెంట్ ముబారక్, సచివాలయ సర్వేయర్ మానస, వీఆర్‌ఏ ఇర్ఫాన్ అలీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.వెదురుకుప్పం: మండలంలోని మొండి వెంగనపల్లి పంచాయతీ కేంద్రంలో శుక్రవారం తహశీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. 58అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగయ్య, ిలోకేష్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.సోమల: రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతి అర్జీకి తగిన న్యాయం చేస్తామని అర్జీదారులకు సమస్య పరిష్కరిస్తామని సోమల తహశీల్దార్ బెన్నురాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని 81 చిన్న ఉప్పరపల్లి సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సును పలు శాఖల అధికారులతో ప్రజలతో నిర్వహించారు. మొత్తం65 అర్జీలు వచ్చాయని వెల్లడించారు.తవణంపల్లి: మండలంలోని గోవిందరెడ్డిపల్లి సచివాలయంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ సుధాకర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిరిపారు. ప్రజల వద్ద నుంచి అందిన అర్జీలకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ఎంపీడీవో రెడ్డి బాబు, నాయకులు దిలీప్ నాయుడు, వెంటేశ్వర చౌదరి, భాస్కర్ నాయుడు, సర్పంచ్ సురేష్‌కుమార్, విఆర్‌ఓ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.బంగారుపాళ్యం: మండలంలోని మహాసముద్రం లో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. తహశీల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ యోగానం దం ఎండోమెంట్ సిబ్బంది, మధుసూదన్, ఆర్‌ఐ మధుసూదన్, మండల సర్వేయర్ లావణ్య, విఆర్‌వోలు రఘునాథ్, నవీన్, సునీల్, రామకష్ణ, సురేంద్ర, పంచాయతీ కార్యదర్శి హరిత, విలేజ్ సర్వేర్ శరవణ పాల్గొన్నారు.కార్వేటినగరం: గ్రామీణ ప్రాంతాలలో భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ నెల 6వతేది నుంచి 30వ తేది వరకు రెవిన్యూ సదస్సు నిర్వహించినట్లు మండల తహసీల్దార్ కొమ్ము నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం సురేంద్ర నగరంలో రెవిన్యూ సదస్సులో మ్యూటేషను, రీసర్వే, నూతనంగా వివాహం చేసుకున్న వారికి రేషన్ కార్డులపై వినతులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిటి త్యాగరాజు, స్వారుపరాణి, మండల సర్వేయర్ బాబు, సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం ఈవో కష్ణనాయక్, ఆర్‌ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.ఎస్‌ఆర్ పురం: రైతుల సమస్యలను పరిష్కరిం చడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ లోకనాథ పిల్లై అన్నారు. మండలంలోని నెలవాయి జిఎంఆర్ పురంలో సదస్సు నిర్వహించి ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు.