బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి

ప్రజాశక్తి – పెంటపాడు

కొత్త ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని రైతు సంఘం నాయకులు చిర్ల పుల్లారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులుకండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండలంలోని మీనవల్లూరు, కోరుమిల్లి, బి.కొండేపాడు గ్రామాల్లో వారు పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకుని మాట్లాడారు. మూడోసారి అధికారం చేపట్టిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాలన్నారు. ఉపాధి కూలి రూ.600 ఇవ్వాలని కుటుంబానికి రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం వంటిదన్నారు. అలాంటి చట్టాన్ని ప్రకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధి కూలీలు మాట్లాడారు.

➡️