డాల్ఫిన్ డెల్ హై స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు

Jan 11,2025 16:19

ప్రజాశక్తి – రైల్వేకోడూరు : పట్టణంలోని డాల్ఫిన్ డెల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కరస్పాండెంట్ పంజం సుకుమార్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంప్రదాయ దుస్తులు ధరించి హరిదాసు సోది చెప్పే మహిళా వేషధారణలో విద్యార్థులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భోగిమంట వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️