విద్యార్థి దశలో సినిమాలకు దూరంగా ఉండాలి –

Mar 17,2025 00:29
జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ఆలపాటి గిరిధర్‌

ప్రజాశక్తి పాడేరు : లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తామని విశాఖ జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి ఆలపాటి గిరిధర్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీకృష్ణాపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధ్యక్షురాలు ఎం. వి .శేషమ్మ అధ్యక్షతన పోక్సో చట్టం పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైంగిక దాడులకు పాల్పడే వారికి పది నుండి 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థి దశలో సినిమా ప్రభావాలకు లోన్‌ కాకుండా ఉన్నతంగా చదువుకోవాలని సూచించారు. పొగడ్తలకు వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. బాహ్య సౌందర్యాన్ని చూసి ఎదుట వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదని సూచించారు. సమాజంలో కొంతమంది వ్యసనాలకు బానిసై అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థి దశలో అందరూ సిన్సియర్గా ఉండాలని అనుకుంటారని చెప్పారు. నేరం జరిగినప్పుడు మనకెందుకులే అని సమాచారం అందించకపోవడం నేరమని పేర్కొన్నారు. తెలిసిన సమాచారాన్ని బాధ్యతగా పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. మత్తు పదార్థాలకు డ్రగ్స్‌ కు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ అధ్యక్షురాలు ఎం వి శేషమ్మ మాట్లాడుతూ, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశలో సినిమా ప్రభావాలకు లోన్‌ కాకుండా దూరంగా ఉండాలని సూచించారు.అడిషనల్‌ ఎస్పీ ధీరజ్‌ మాట్లాడుతూ, మభ్యపెట్టి పాల్పడితే కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఫోక్సొ చట్టంపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సీలేరు, చింతపల్లి, పాడేరులో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. చెప్పారు. అనంతరం ఆపద సమయంలో ఆపద సమయంలో మీకోసం ఉమెన్‌ చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్ల తో రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో చోడవరం సబ్‌ జడ్జి వి. గౌరీ శంకర్‌, అనకాపల్లి ప్రిన్సిపల్‌ సివిల్‌ జడ్జ్‌ ధర్మారావు, ఐసిడిఎస్‌ పిడి పి. సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎల్‌. రజిని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా, జిల్లా విద్యాశాఖ అధికారి పి. బ్రహ్మాజీరావు, పాడేరు తాహసిల్దార్‌ వి. త్రినాధ రావు నాయుడు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల పాల్గొన్నారు.

➡️