సీసీ రహదారిపై గోతులు : ప్రయాణికుల వెతలు

ప్రజాశక్తి – ఆచంట

ఆచంట మండలం వల్లూరు, గుమ్మలూరు వెళ్లే ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. దీంతో వాహన చొధకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహన చొధకులు గోతుల్లో పడి స్వల్ప గాయాలతో బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక దాత మామిడి శెట్టి పెద్దిరాజు స్పందించి తన సొంత ఖర్చులతో సిమెంటుతో గోతులను పూడ్చే పనిలో నిమగమయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

➡️