మండలంలో సామాజిక తనిఖీ.

మండలంలో సామాజిక తనిఖీ.

ప్రజాశక్తి – పెనుమంట్ర

స్థానిక పెనుమంట్ర మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి 17వ విడత సామాజిక తనిఖీ జరిగింది. ప్రజావేదిక 2023 -24 సంబంధించి 1337 పనులకు గాను 6 కోట్ల 35 లక్షల సంబంధించి ఆడిట్‌ ది 26. 12.24 నుండి ది 8.01.25 వరకు అన్ని గ్రామాల్లో తనిఖీ నిర్వహించి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించి జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గారు డాక్టర్‌ కే. సిహెచ్‌. అప్పారావు ప్రిసైడింగ్‌ అధికారిగా ప్రజావేదిక నిర్వహించి, వీటికి సంబంధించి 36,968 రూపాయలు సిబ్బంది నుండి రికవరీ గా ఆదేశించారు. అలాగే 1,03,500 రూపాయల విలువైన పనులకు సంబంధించి రికార్డు లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసి జిల్లా విజిలెన్స్‌ అధికారికి సమర్పించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ అభివద్ధి అధికారి బీవీఎస్‌ వి శర్మ, అంబుడ్స్‌ మా విజిలెన్స్‌ అధికారులు, మండల స్థాయి అధికారులు,ఉపాధి హామీ సిబ్బంది, సామజిక తనిఖీ అధికారులు పాల్గొన్నారు.

➡️