కెజిహెచ్‌కు విద్యార్థి తరలింపు

విద్యార్థి కుటంబీకులతో మాట్లాడుతున్న పిఒ అభిషేక్‌

ప్రజాశక్తి-పాడేరు : ముంచంగిపుట్టు మండలం బాబుసాల పంచాయితీ గాజుల బంద గ్రామానికి చెందిన గొల్లూరి వంశీ (14) మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమం పాఠశాల-2 లో 9వ తరగతి చదువుతున్నాడు. బలహీనంగా ఉండటంతో రక్తహీనతతో బాధ పడుతున్నాడేమో అని భావించి అధికారులు శనివారం పాడేరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకొని వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విద్యార్థి గుండె సమస్యతో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. విద్యార్థిని విశాఖపట్నం కెజిహెచ్‌ తరలించాలని సూచించగా తల్లిదండ్రులు నిరాకరించారు. వెంటనే సమాచారాన్ని ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి. అభిషేక్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రాజెక్ట్‌ అధికారి జిల్లా ఆస్పత్రిని సందర్శించి విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించి ప్రత్యేకంగా అంబులెన్స్‌ ను ఏర్పాటు చేసి విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. అనంతరం ఆయన ట్రైబల్స్‌ అధికారులతో మాట్లాడి వంశీకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వార్డెన్‌ రాంబాబును విద్యార్థి వెంట వెళ్లాలని పిఓ ఆదేశించారు. విద్యార్థితోపాటు వార్డెన్‌, విద్యార్థి తండ్రి కేజీహెచ్‌ బయలుదేరి వెళ్లారు.

➡️