హైదరాబాద్ : లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కితీసుకుంది. ఫార్మా విలేజ్‌ల భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాలను ఫార్మా విలేజ్‌ల కోసం సేకరించాలని ఆగస్ట్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌పై గ్రామస్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.