అదనపు విద్యుత్‌ ఛార్జీల భారం తగదు

Nov 9,2024 22:51
IMG-

భీమనపల్లిలో ప్రజాపోరు కరత్రాలను ఆవిష్కరిస్తున్న కారెం వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – ఉప్పలగుప్తం

ట్రూ అప్‌ చార్జీల పేరుతో పేదలపై అదనపు విద్యుత్‌ ఛార్జీలు వేయడం తగదని సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అన్నారు. అర్హులైన వేదలందరికీ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ లు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్‌ 8 నుండి 15 వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా శనివారం భీమనపల్లి కాలనీ గ్రామంలో కరపత్రాలు పంపిణీ చేశామని వెంకటేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేదలపై భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈనెల 14 న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. దేశవ్యాప్తంగాను రాష్ట్రంలోనూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ ప్రజాపోరును నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు తగ్గించాలని, మహిళలపె, పిల్లలపై, దళితులపైనా హత్యలు, అత్యాచారాలు నియంత్రించాలన్నారు. విద్యుత్‌ ఛార్జీల పేరుతో ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామీణ పేద ప్రజలు ఉపాధి హామీ చట్టంపైన ఆధారపడి జీవిస్తున్నారని, ఉపాధి హామీ చట్టంలో కూలీలకు ఏడాదికి 200 రోజులు పనులు కల్పించి రోజుకు రూ.600 రూపాయలు వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారని బెల్ట్‌ షాపులను రద్దు చేయాలని ప్రజలు ఇబ్బంది కలిగే చోట్ల మద్యం షాపులను తొలగించాలని డిమాండ్‌ చేశారు . తక్షణం ఉచిత ఇసుకను ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని కోరారు.ఉచిత గ్యాస్‌ ను అర్హులైన తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలందరికీ తక్షణమే అందించాలన్నారు. రోడ్లు, మంచినీళ్లు, డ్రయినేజీలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించాలని తదితర సమస్యల పైన ఈ జిల్లాలో ప్రజలందరినీ కదిలించి నవంబర్‌ 14న కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బీర వెంకట్రావు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. ‘ప్రజాపోరు’ ను జయప్రదం చేయాలని పిలుపుఅమలాపురం రూరల్‌: సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్‌ 8 నుంచి 15 వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు టి.నాగ వరలక్ష్మి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే శనివారం అమలాపురం మండలం కుమ్మరి కాలవగట్టు ప్రాంతంలో నాగ వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగాను, రాష్ట్రంలోనూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఈ ప్రజాపోరును నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్ని మండలాల్లోనూ నిరసన కార్యక్రమాలు నిర్వహించి నవంబర్‌ 14న జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు తగ్గించాలని, తదితర సమస్యల పైన జిల్లాలో ప్రజలందరినీ కదిలించి కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.శ్యామల దేవి, ఎ.దుర్గ, ఎ.మంగాదేవి, మణిమాల, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

➡️