అరసవల్లి హుండీ ఆదాయం రూ.73.06 లక్షలు

అరసవల్లి సూర్యనారాయణ స్వామి

హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సిబ్బంది, సేవకులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ హుండీని ఆలయ ప్రాంగణంలోని అనివెట్టి మండపంలో సోమవారం లెక్కించారు. ఆలయ ఇఒ ఎస్‌.చంద్రశేఖర్‌ ఆధ్వర్యాన దేవాదాయశాఖకు చెందిన ముగ్గురు ఇఒలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో లెక్కింపు చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా ఆలయానికి యాత్రికుల రద్దీ అధికంగా ఉండడం వల్ల సుమారు 300 మందితో లెక్కింపు చేశారు. గత నెల రెండో తేదీ నుంచి ఈనెల పదో తేదీ వరకు హుండీ ఆదాయం రూ.73.06 లక్షలు లభించింది. నోట్ల రూపంలో రూ.70,38,653, చిల్లర నాణేల రూపంలో రూ.2,67,120 మొత్తం రూ.73,05,873 ఆదాయం లభించిందని ఆలయ ఇఒ చంద్రశేఖర్‌ తెలిపారు. నగదుతో పాటు 26 గ్రాముల బంగారం, నాలుగు కేజీల 200 గ్రాముల వెండి, యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా డాలర్లు 3, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ శ్రీలంక రూ.50, బ్యాంకు నెగర మలేషియా 1 రింగ్గిట్‌ వచ్చాయని తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో విజయనగరం జిల్లా రామతీర్థాలు ఇఒ శ్రీనివాసరావు, శ్రీకూర్మం ఇఒ జి.గురునాథం, అరసవిల్లి అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ జి.ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️