మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కార్పొరేషన్‌ ఎదుట మహా ధర్నాలో సిఐటియు డిమాండ్‌
ప్రజాశక్తి – కడప అర్బన్‌
మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కార్పొరేషన్‌ ఎదుట మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సుంకర కిరణ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సమస్యలను అధికారుల దష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు. చట్టబద్ధమైన సెలవులు, పనిముట్లు, రక్షణ పరికరాలు, డెత్‌ స్కీం పోస్టులు వారి పిల్లలకు ఉద్యోగాలు, కార్మికులకు ఎఎఫ్‌, ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అడిషనల్‌ కార్మికలుకు పని భద్రత కల్పించకపోతే, ఉద్యమాన్ని మరింత ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పారు. మున్సిపల్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, అదేవిధంగా క్లాప్‌ డ్రైవర్లకు జీవో నంబర్‌ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐతో కూడిన పని భద్రత కల్పించాలని పేర్కొన్నారు. నగర విస్తత పెరిగిందని, కార్మికుల సంఖ్యను పెంచాలని, సెక్షన్‌ కార్మికులకు జీవో నంబర్‌ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు అపరిస్కతంగా ఉన్నాయని చెప్పారు. కార్మికులను పట్టిం చుకోకపోగా సెక్రెటరీ వేధింపులు విపరీతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నగరంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ సెక్షన్‌ కార్మికులకు జీవో నంబర్‌ 36 ప్రకారం రూ. 21వేలు జీతం చెల్లించాలని తెలిపారు. నీళ్లు, వీధిలైట్లు, నగరాల సుందరీకరణ చేయడంలో వారి పాత్ర గణనీయమైందని చెప్పారు. ప్రభుత్వం వారిని గుర్తించి కనీసం వేతనం ఇవ్వాలని, ఒకే రకమైన వేతనాలు మున్సిపల్‌ కార్మికులు అందరికి ఇవ్వాలని కోరారు. నగరంలోని క్లాప్‌ వ్యవస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు కనీసం పని భద్రత లేకుండా యాజమాన్యం వివరిస్తుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 36 ప్రకారం 9 మందికి డ్రైవర్లకు పెండింగ్‌లో ఉన్నా యన్నారు. 13 మంది డ్రైవర్లను కూడా ప్రమోట్‌ చేయాలన్నారు. కడప నగరంలో ఉన్న వెహికల్స్‌ పూర్తిస్థాయిలో అధికారులు మరమ్మతులు చేయించాలని డిమా ండ్‌ చేశారు. అరకొర రిపేర్లు చేయించి బయటికి పోవడం వల్ల మళ్ళీ షెడ్డుకు వస్తాయని చెప్పారు. అలా రాకుండా చూడాలని పేర్కొన్నారు. కార్మికులకు అందరికీ భద్రత కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులపై రాజకీయ వేధింపులు పెరిగాయన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తామని, అవసరమైతే సమ్మెకు పోతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ నాయకులు ఇత్తడి ప్రకాష్‌, ఆనంద్‌, నాగరాజు, నరసింహులు, సాయి, నిత్యపూజయ్య, ఆదాము, మస్తాన్‌, పెద్దోడు, బాలాజీ, రమాదేవి, దస్తగిరిమ్మ, సుంకన్న, నాగయ్య, కార్మికుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిఐటియు నేతలు దాసరి విజరు, ఏసుదాసు తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపాల్టీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణం, మున్సిపాలిటీ పరిశుభ్రత కోసం పారిశుధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులతో పాటు పర్మినెంట్‌ సిబ్బంది, కోవిడ్‌ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌, క్లాప్‌ డ్రైవర్లుగా సేవలు చేస్తున్నామన్నారు. చట్టబద్ధమైన సౌకర్యాలు, సెలవులు, రక్షణ పరికరాలు, వాహనాల మరమ్మతులు, పనిముట్లు సకాలంలో ఇవ్వడం లేదని వాపోయారు. యూనిఫాం, చెప్పులు, సబ్బులు, నూనెలు, టవల్స్‌ ఇవ్వడంలో జాప్యం చేయడం జరుగుతోందని వాపోయారు. ఇప్పటికైనా 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

➡️