ప్రజాశక్తి-హుకుంపేట:-మండలంలోని తాడిపుట్టు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సచివాలయం సిబ్బందితో సర్పంచ్ సోమేలి సత్యవతి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తప్పులు లేకుండా సక్రమంగా సర్వే నిర్వహించాలని సచివాలయం సిబ్బందికి ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పి 4 సర్వేను చేయాలని, గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తెలిపారు. గ్రామాలలో నాలుగు రకాలుగా సర్వే నిర్వహించాలని ఆమె పేర్కొన్నారు.ప్రతి ఇంట కుటుంబంలో జీవన స్థితిగతులు, వాటి వివరాలపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి వైస్ సర్పంచ్ సిదారి శోభన్ బాబు వార్డు సభ్యులు కిరసాని సుబ్బారావు, తూబూరు వసంతకుమారి తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్చార్జి సోమేలి లక్ష్మయ్య, పిశా ఉపాధ్యక్షులు అదేరి రాంబాబు, బొర్గం కొండబాబు, పీసా సెక్రటరీలు ఆనంద, విజయభాస్కర్ నాయుడు, ఒలుగు సూరిబాబు, డిఎ రోజా రాణి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీలక్ష్మి, వెల్ఫేర్ అసిస్టెంట్ సత్యనారాయణ పడాల్, మహిళా పోలీస్ దివ్య, విఏవో మత్య లింగం పాల్గొన్నారు.
