న్యూఢిల్లీ : ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్‌సింగ్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, సంస్థలు పదవీ విమరణ వయసులో మార్పులు చేయాలని కోరారా? అని లోక్‌సభలో అఢిగిన ప్రశ్నకు.. ఆయన జాతీయ మండలి (జాయింట్ కన్సల్టేటివ్ మెకానిజం) సిబ్బందివైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు వివరాలు, పదవీ విరమణ వయసు తేడాలకు కారణాలను వివరించాలని కోరగా.. ఈ విషయం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని.. అలాంటి డేటా ఏదీ కేంద్రం వద్ద ఉండదని ఆయన చెప్పారు.
