ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బిజెపి అభ్యర్థి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బిజెపి ఢిల్లీ విభాగం చీఫ్ రమేష్ బిధూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా పోటీలో ఉన్నారు. ఆప్ వరుసగా రెండుసార్లు గెలిచిన కీలక నియోజకవర్గం జాంగ్‌పుర నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా మనీష్ సిసోడియా, బిజెపి నుంచి తర్వీందర్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఫర్హద్ సూరి పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఆప్, బిజెపి మధ్యనే ఉంది. కాంగ్రెస్ సైతం మెరుగైన ఫలితాలు ఆశిస్తోంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
