కిలోమీటర్‌ పరిధిలో రెండు ప్రమాదాలు

లారీని ఢకొీన్న ఆర్‌టిసి బస్సు ఘటనలో11 మందికి గాయాలు
ఆర్‌టిసి బస్సును వెనుక నుంచి ఢకొీన్న లారీ
రెండు ప్రమాదాలూ జాతీయ రహదారిపైనే
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌, సిటీ
ఏలూరు జాతీయ రహదారిలో ఆరు రోజుల వ్యవధిలో నాలుగు బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అటు దెందులూరు, ఇటు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదాల చోటు చేసుకున్నాయి. మొదటి రెండు ప్రమాదాల్లో ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సులు బోల్తా పడ్డాయి. బుధవారం ఒక్కరోజే రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆర్‌టిసి బస్సు లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి అదే లారీని వెనుక నుంచి ఢకొీట్టింది. బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 11 మంది గాయాలపాలయ్యారు. అలాగే ముందుగా వెళ్తున్న ఆర్‌టిసి ట్రాటీ లారీ వెనుక నుంచి ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఏలూరు మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు మంగళవారం రాత్రి కాకినాడ నుంచి గుంటూరుకు బయలుదేరింది. బస్సు తెల్లవారుజామున 4:30 సమయంలో ఏలూరు జాతీయ రహదారిలోని రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాల సమీపానికి చేరుకునేసరికి ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి అదుపుతప్పి అదే లారీని వెనుక నుంచి ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో సహా మొత్తం 11 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్‌కు గాయాలు కాలేదు. గాయాలైనవారిలో లారీ డ్రైవర్‌ కడియం రామశేషు, బస్సులో ప్రయాణికులు ఐ.సత్యసాయి (కాకినాడ), కర్రి హారిక (రావులపాలెం), వెళ్ల రాజు (మాచవరం), కె.సుబ్రహ్మణ్యం (కాకినాడ), కె.వెంకటలక్ష్మి (రామచంద్రపురం), కె.సురేష్‌ (కాకినాడ), ఆరేపల్లి సాయి దుర్గాప్రసాద్‌ (తణుకు), వి.దత్తునాయక్‌ (గుంటూరు), జె.పవన్‌కుమార్‌ (కాకినాడ), ఆకుల శివాజీ (కడియపులంక) ఉన్నారు. వీరందరిని 108 వాహనాల సాయంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కొందరు వారి వారి గమ్యస్థలానికి వెళ్లిపోయారు. బస్సు లారీ పాక్షికంగా దెబ్బతినడంతో వాటిని ఏలూరు మూడో పట్టణ పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. దాదాపు తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో గంటన్నర పాటు విజయవాడ వైపు వెళ్లే ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రెండు గంటలు శ్రమించి బస్సును లారీని పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.క్షతగాత్రులకు రెడ్డి అప్పలనాయుడు పరామర్శఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎపిఎస్‌ ఆర్‌టిసి జోనల్‌ ఛైర్మన్‌, బోర్డు డైరెక్టర్‌ రెడ్డి అప్పలనాయుడు పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు. వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఏలూరు డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ మురళీ, స్టేషన్‌ మేనేజర్‌ కుమారి, ఏలూరు ఆర్‌టిసి అధికారులు, జనసేన నాయకులు ఉన్నారు.ఆర్‌టిసి బస్సును ఢకొీన్న లారీవిజయవాడ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు విశాఖపట్నం నుంచి విజయవాడ మంగళవారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరింది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ వారి వారి గమ్యస్థానాల్లో దిగిపోగా బస్సు చివరి ప్రయాణికుడు ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద దిగాడు. అనంతరం బస్సు విజయవాడ వైపు వెళ్తున్న సమయంలో గురుకుల పాఠశాల సమీపానికి చేరుకునేసరికి వెనుక నుంచి ట్రాలీ లారీ ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్‌కు, బస్సు డ్రైవర్‌కు గాయాలు కాలేదు. ఈ ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వాహనాలను మూడో పట్టణ పోలీసులు రోడ్డు పక్కకు చేర్చి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

➡️