డిప్యూటీ ఎంపిడిఒ ఎం.వెంకటేష్
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
ప్రతి ఇంటి నుంచీ తడి, పొడి చెత్త వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించే అలవాటు చేయాలని డిప్యూటీ ఎంపిడిఒ ఎం.వెంకటేష్ సూచించారు. మండలంలోని పట్టెంపాలెంలో మంగళవారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌పై ఇంటింటికీ వెళ్లి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపిడిఒ ఎం.వెంకటేష్ మాట్లాడుతూ తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం ద్వారా తడి చెత్తను కంపోస్ట్ చేసి, పొడి చెత్తను విడదీసి సంపద సృష్టించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.