
- యోగి సర్కారు కక్షసాధింపు చర్యలు
- 1332 మంది అవుట్‌సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగులపై వేటు
- 20న కోర్టుకు హాజరు కావాలంటూ నేతలకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం
ప్రయాగ్‌రాజ్ : ఉత్తర ప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల మూడు రోజుల సమ్మె విజయవంతమైంది. గతేడాది డిసెంబరు 3న రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 16 నుంచి ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. ఆ ఒప్పందం నుంచి ఎటువంటి కారణం లేకుండానే రాష్ట్రప్రభుత్వం వైదొలగింది. ఈ అంశంపై మూడు నెలలుగా నాయకులు పలు దపాలు చర్చించినా, ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. దీంతో, ఆ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మె నిర్వహించాలని విద్యుత్ కర్మాచారీ సంయుక్త సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. దీంతో, ఉద్యోగులు ప్రారంభించిన సమ్మె శనివారం ముగిసింది. యోగి ప్రభుత్వం ఉద్యోగుల అక్రమ అరెస్టులకు, సామూహిక సస్పెన్షన్లకు, అణచివేత చర్యలకు పాల్పడుతోంది.
- నేతలపై కోర్టు ధిక్కార చర్యలు
కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ ఉద్యోగులు సమ్మె సాగిస్తుండడానిు తీవ్రంగా పరిగణనలోకి తీసుకును అలహాబాద్ హైకోర్టు శుక్రవారం యూనియన్ నేతలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టడం ఆరంభించింది. సోమవారం కోర్టుకుహాజరు కావాల్సిందిగా వారిని కోరుతూ వారంటు జారీ చేసింది. వివిధ సంఘాలకు చెందిన 18మంది ఆఫీస్ బేరర్లకు ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యుపిపిసిఎల్) నోటీసులు జారీ చేసింది. ఈ అంశం అత్యవసరాన్ని దృష్టిలో వుంచుకుని విద్యుత్ కర్మాచారి సంయుక్త సంఘర్ష్ సమితి ఆఫీసు బేరర్లపై బెయిలబుల్ వారంట్లు జారీ చేసినట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. సమితి కన్వీనర్ శైలేంద్ర దూబేతో సహా ఇతర నేతలందరూ సోమవారం ఉదయం 10గంటల కల్లా లకోు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సి వుంది. విద్యుత్ సరఫరాకు ఆటంకం వుండకూడదని ఆదేశిస్తూ గతేడాది డిసెంబరు 6న జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వుండేలా, తప్పు చేసిన అధికారులు, ఉద్యోగులపై తగు చర్యలు తీసుకోవాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వానిు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను 20వ తేదికి వాయిదా వేసింది. అప్పటికల్లా తీసుకును చర్యల నివేదికను అందజేయాల్సిందిగా ప్రభుత్వానిు కోరింది. విద్యుత్ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ ఆరోజున అఫిడవిట్‌ను అందజేయాలని ఆదేశించింది.
- సిఐటియు ఖండన
శాంతియుతంగా సమ్మె చేస్తున్న యుపి విద్యుత్ ఉద్యోగులపై అణచివేత చర్యలు, అరెస్టులకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వ నిరంకుశ చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. యుపి ప్రభుత్వ నియంతృత్వ పోకడలను, మొండి వైఖరిని, సామూహిక సస్పెన్షన్లను తీవ్రంగా నిరసిస్తూ, సమ్మె చేస్తును యుపి విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ నిర్వహించాల్సిందిగా కార్మిక లోకానికి, అనుబంధ యూనియన్లకు పిలుపునిచ్చింది. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ కో-ఆర్డినేషన్ కమిటీ (ఎన్‌సిసిఒఇఇ) దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించింది