Aug 01,2022 16:27

లక్నో : 30 ఏళ్ల దళిత మహిళపౖౖె లైంగిక దాడికి పాల్పడిన ఏడుగుర్ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గన్‌తో గురిపెట్టి.. బలవంతంగా ఆమె చేతే ఆమె దుస్తులు విప్పంచి.. ఆ ఘటననంతా వీడియో తీసి పైశాచితను ప్రదర్శించారని పోలీసులు తెలిపారు. అనంతరం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారన్నారు. ఈ ఘటన జులై 30 సాయంత్రం ముజఫర్‌ నగర్‌ జిల్లాóలోని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ గ్రామంలో జరిగిందని తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గడ్డి కోసేందుకు వెళ్లగా.. ఏడుగురు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు గన్‌తో బెదిరింఇచి దుస్తులు విప్పించి.. ఆ ఘటననంతా వీడియో తీశారని తెలిపారు. నిందితులపై ఐపిసిలోని 354బి, 506 సెక్షన్లతో పాటు ఎస్‌సి, ఎస్‌టి చట్టంలోని సెక్షన్‌ 3, ఐటి చట్టంలోని సెక్షన్‌ 67 కింద అభియోగాలు నమోదు చేశామని కొత్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఒ ఆనంద్‌ దేవ్‌ మిశ్రా తెలిపారు. నిందితులు అనూజ్‌, కుల్‌దీప్‌, అంకిత్‌, రవి, రిజ్వాన్‌, చోటా, అబ్దుల్‌గా గుర్తించి.. అరెస్టు చేశామన్నారు.