Jan 19,2022 11:24

ప్రజాశక్తి-పిచ్చాటూరు (చిత్తూరు) : పిచ్చాటూరు మండలంలోని అడవి శంకరాపురం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్‌ వైసిపి నాయకుడైన సిద్దయ్య గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. బుధవారం ఉదయం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ నాయకులతో కలిసి సిద్దయ్య స్వగ్రామమైన అడవి శంకరాపురంలో నివాళులు అర్పించి, సిద్దయ్య భార్య పిల్లలను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే సిద్దయ్య వైసిపి కోసం పనిచేసి కార్యకర్త నుంచి నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. సిద్ధయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. నివాళులు అర్పించినవారిలో గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి పద్దు రాజు, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ నాయుడు, ఎంపిటిసి రమేష్‌ రాజు, మాజీ సర్పంచ్‌ అరుముగం రెడ్డి, మోహన్‌, లోకేష్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.