May 17,2022 22:39

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి విలేకరులు : చిలమత్తూరు : చిలమత్తూరు మండలంలో జరుగుతున్న ఉపాధి పనులను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ మంగళవారం పరివీలించారు. ఈ మేరకు ఆయన చిలమత్తూరు మండలంలో విస్తృతంతగా పర్యటించి సచివాలయాలను, రైతుభరోసా కేంద్రాలను తనికీ చేశారు. ముందుగా పలగల పల్లి లో ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడి ఉపాధి కూలీలతో మాట్లాడారు. అక్కడినుంచి కానుగ మాకులపల్లి రోడ్డు నుంచి ద్విచక్ర వాహనంలో బయల్దేరి చెరువులో జరుగుతున్న ఉపాధిపనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు వచ్చేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పలగల పల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సచివాలయంలో రిజిస్టర్లను, బయోమెట్రిక్‌ హాజరును తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రం భవనం, గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. నాణ్యతగా భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ నరేందర్‌ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. అనంతరం కోడూరు పంచాయతీ లోని చెత్తనుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్‌ కలెక్టర్‌ నవీన్‌, తహశీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీవో రామకుమార్‌, ఎపిడి శివానంద నాయక్‌, ఏపీవో రాజశేఖర్‌ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి : చెన్నేకొత్తపల్లి మండలంలోని స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు మండలంలోని చెత్తను ఒక్కచోటికి చేర్చి వానపాములతో చెత్తను కంపోస్ట్‌ తయారు చేయడం మంచి కార్యక్రమం అని వారిని అభినందించారు. అలాగే మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు.