Mar 27,2023 22:58

ప్రజ్ఞ పరీక్షల విజేతలకు బహమతులు అందజేస్తున్న ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ


- ప్రజ్ఞా వికాసం సభలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి
ప్రజాశక్తి - జగ్గంపేట
రాష్ట్రవ్యాప్తంగా నాడు-నేడు నిధులతో పాఠశాలలకు రంగులు వేస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం అదే పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ ప్రభత్వాని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఎస్‌.ఎఫ్‌.ఐ, యు.టి.ఎఫ్‌ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పేరిట నిర్వహించిన పరీక్షలో విజేతలకు బహుమతీ ప్రదా నోత్సవ సభ సోమవారం జగ్గంపేట స్వామి వివేకానంద విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించారు. ఎస్‌.ఎఫ్‌.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి..రాజా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంఎల్‌ఎసి సాబ్జీ మాట్లాడారు. అందరికీ విద్యతోనే సమ సమాజం సాధమవుతుందని, పదవ తరగతి అనేది విద్యార్థి దశలో తొలిమెట్టని ఈ పరీక్షల్లో విద్యార్థుల విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలు లోపున్న యువత నేడు నిరుద్యోగులుగా ఉండిపోయారని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే యువత దేశ అభివృద్ధికి ఉపయోగపడతారని అన్నారు. అధ్యయనం- పోరాటం నినాదంతో విద్యార్థుల సమస్యలపై పోరాడటమే కాకుండా విద్యార్థుల్లో సజనాత్మకతను వెలికి తీసి, పరీక్షలపై భయాన్ని పోగొడుతూ ఎన్నో పోటీ పరీక్షలు నిర్వహిస్తూ అందులో భాగంగా టెన్త్‌ విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ కమిటీలను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా సహాయ కార్యదర్శి జి. దినేష్‌కుమార్‌, యుటిఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు పి.వి.వి సత్యనారాయణ, జనవిజ్ఞాన వేదిక జిల్లా సహా కార్యదర్శి జె. రవివర్మ, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సాయిరాం శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, శ్రీ స్వామి వివేకానంద ప్రిన్సిపల్‌ రాజారావు, విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ పోటీలలో జగ్గంపేట మండలం ప్రథమ బహుమతి రవీంద్ర భారతి స్కూల్‌ విద్యార్థిని ఎస్‌.దుర్గాశివాని, ద్వితీయ బహుమతి సాహితి పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి ఇమాన్యుల్‌, తతీయ బహుమతి చైతన్య స్కూల్‌ విద్యార్థిని వైష్ణవి అందుకున్నారు. పాఠశాల వారీగా ప్రథమ బహుమతులను జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని బి. జయంతి, భాస్కర్‌ స్కూల్‌ విద్యార్థి రాజారెడ్డి భాస్కర్‌, మల్లిశాల ప్రభత్వు పాఠశాల విద్యార్థి ఎం.మహేష్‌, స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థిని బి.మనోజ్ఞ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకులం విద్యార్థిని టి. విమల దక్కించుకున్నారు.