Feb 08,2023 16:07
  • 200 రోజులు పనులు రూ 600 కూలి పెంచాలి
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న

ప్రజాశక్తి కర్నూలు హాస్పిటల్  : ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న డిమాండ్ చేశారు. బుధవారం లొద్ది పల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను బి నాగన్న అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న  మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి 11 వారాలు అవుతున్నా కూలీ డబ్బులు రాలేదని కూలీలు తమ ఆవేదనను తెలిపారని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం  చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ నిధులను రూ 30 వేల కోట్లు తగ్గించి కేటాయించారని ఇది గ్రామీణ పేదల ఉసురు తీయడమేనని విమర్శించారు. సాఫ్ట్వేర్ మార్పు పేరుతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దానికోసం రకరకాల మార్పులు తెచ్చి కూలీలను ఇబ్బందులకు  గురిచేస్తుందని అన్నారు. ఇప్పటికే గ్రామీణ పేదలు విపరీతమైన ధరల పెరుగుదలతో నిత్యవసర వస్తువులు కొనే పరిస్థితిలో లేరని దానికి తోడు అతివృష్టి అనావృష్టి వల్ల వ్యవసాయం  పని దినాలు పడిపోయాయని దీనివల్ల వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులకు వెళితే పనిచేసిన 15 రోజుల్లో కూలి డబ్బులు వస్తాయని ఆశించిన కార్మికులకు 11 వారాలైనా ఒక్క పైసా ఇవ్వలేదని తక్షణమే ఉపాధి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. జాబ్ కార్డు లేని వారందరికీ జాబ్ కార్డులు మంజూరు చేసి కొలతలతో సంబంధం లేకుండా ప్రతి ఒకరికి రోజుకు ప్రభుత్వం నిర్ణయించిన  257 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని  లేనిపక్షంలో కూలీలు సచివాలయాలను ముట్టడిస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ మాసుం భాష ఉపాధి కూలీలు మెట్లు తదితరులు పాల్గొన్నారు.