Jul 29,2021 22:47

బీచ్‌ వద్ద ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి
ఉపరితల ఆవర్తనం, దీనికి తోడు బంగళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉప్పాడ సముద్రతీరం ముందుకు చొచ్చుకు వచ్చింది. గురువారం ఉదయం నుంచి సముద్రం అలజడిగా ఉంది. దీంతో కొత్తపట్నం, మాయాపట్నం, కొనపాపపేట వద్ద సముద్రం సాధారణం కంటే సుమారు 10 మీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చింది. కొత్తపట్నం వద్ద సముద్రం జియోట్యూబ్‌ ప్రాంతాన్ని తాకుతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కోనపాపపేట వద్ద భారీగా సముద్ర తీరం కోతకు గురవుతోంది. దీంతో సముద్ర తీరప్రాంతం సమీపంలో నివాసం ఉంటున్న మత్స్యకారులకు చెందిన ఇల్లు సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పడమర వైపు నుంచి వీస్తున్న ఈదురుగాలుల వల్ల ఈ మాత్రమైనా సముద్రం ఉప్పొంగకుండా ఉందని అదే సముద్రం మీద నుంచి గాలులు వీస్తే సముద్రం కెరటాలుఉవ్వెత్తున ఎగసి పడతాయని మత్యకారులు తెలుపుతున్నారు.