Jan 15,2022 00:50

బండలాగుతున్న ఎడ్ల బండలాగుతున్న ఎడ్ల

ప్రజాశక్తి- పర్చూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా మండలపరిధిలోని అన్నంబొట్లవారిపాలెంలో గొట్టిపాటి హనుమంతరావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34వ జాతీయ స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీలకు గురువారం వర్షం అంతరాయం కలిగించింది. శుక్రవారం రెండు పళ్ళ విభాగం ఎడ్లకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గుంటూరు పాత మల్లయ్యపాలెంకు చెందిన నాగిరెడ్డి ఎడ్ల జత 39.7 అడుగుల లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కష్ణాజిల్లా చింతలపాడుకు చెందిన పి.నాగేశ్వరరావు ఎడ్ల జత 37.5 అడుగులు లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. అదే జిల్లాకు చెందిన కె. ప్రభాకర్‌ రెడ్డి కోడలు 36.8 అడుగు లాగి తతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా తోటపాలెంకు చెందిన రత్తయ్య చౌదరి ఎడ్ల జత 36.9 అడుగులు లాగి నాలుగో స్థానంలో నిలిచాయి. శనివారం నాలుగు పండ్ల విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు గోరంట్ల భాస్కర్‌రావు తెలిపారు.