Jun 02,2023 23:29

ఎడ్ల పోటీలను ప్రారంభిస్తున్న అశోక్‌రెడ్డి

ప్రజాశక్తి- అర్ధవీడు : మండల పరిధిలోని నాగులవరం గ్రామంలోనున్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ ముఖద్వార ప్రారంభోత్సవం, శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల విగ్రహాలు, బొడ్డురాయి ప్రతిష్టా ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి పాల్గొన్నారు. స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్లపోటీలను ప్రారంభించారు. ఈ పోటీలు ఉత్సహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.