Jan 15,2022 16:28

ప్రజాశక్తి-కొండపి : ప్రకాశం జిల్లా కొండపి మండలం పెరిదేపి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా గ్రామ పెద్దల సహకారంతో ఎవర్ గ్రీన్ యూత్ ఫోర్స్ అదర్వ్యము లో కొండపి మరియు సంత నూతలపాడు నియోజక వర్గాల స్థాయిలో వాలీబాల్ క్రీడలో నిర్వహించారు. ఈ పోటీల్లో ముప్పయి జట్లు తలపడగా ప్రధమ బహుమతి మద్దులూరు, ద్వితీయ బహుమతి పెరిదేపి గ్రామాలకు చెందిన జట్లు గెలుపొందారు. మొదటి బహుమతి మర్రిపూడి మండల ఆర్. ఐ పృద్వి రాజు, మరియు సర్వేయర్  మల్లెల రాజేష్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతి  కొండపి rwc  డిపార్ట్మెంట్ ల్యాబ్ టెక్నిషియన్ వెంకట్రావు మరియు తృతీయ బహుమతి  అంగలకుర్తి కొటేసు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మర్రిపూడి మండల అర్.ఐ పృద్వి రాజు మాట్లాడుతూ ఆటలు అనేవి సమాజ ఐక్యతకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. సర్వేయర్ రాజేష్ మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక వికాసానికి మరియు చక్కటి ఆరోగ్య కర సమాజానికి ఎంతో ఉపయోగ పడతాయని, క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరత  ఈ సమాజంపై ఎంతయినా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు కమిటీ సభ్యులు బండి క్రాంతి, ఏ.కోటేష్, నిఖిల్, రాజేష్, ప్రసాద్, రవి, మరియు తదితరులు పాల్గోన్నారు. ఆటల పోట్ల అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన ఆటగాళ్లకు మరియు ప్రజలకు రావిపాటి స్వరూప్ భోజన వసతి కల్పించారు.