
ప్రజాశక్తి - మొగల్తూరు
ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సిఐ వి.సురేష్ బాబు సూచించారు. బుధవారం మొగల్తూరులోని జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో ప్రమాదాల బారిన పడి తలకు హాని కలగకుండా హెల్మెట్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ యు.రాజేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.