
ప్రజాశక్తి-కాట్రేనికోన
చెయ్యేరులోని శ్రీనివాసా స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి పి.సంపత్ గణేష్ ఇటీవల గుంటూరులో జరిగిన జెఎన్టియుకె సౌత్ జోన్ అంతర్ యూనివర్శిటీ వాలీబాల్ ఛాంపియన్ షిప్ సెలక్షన్లో ప్రతిభ కనబరచినాడు. బిటెక్ మూడో ఏడాది చదుతువున్న ఇసిఇ విద్యార్థి సంపత్ గణేష్ చెన్నైలో డిసెంబర్ 23 నుంచి 27వరకు జరిగే సౌత్ జోన్ అంతర్ యూనివర్సిటీ వాలీబాల్ ఛాంపియన్ షిప్‌నకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభ లో కళాశాల కరెస్పాండెంట్ డివిఎన్ఎస్.వర్మ ఎంపికైన విద్యార్ధి గణేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రత్నరాజు, పాలకవర్గ సభ్యులు రమేష్ రాజు, సందీప్ లు, కళాశాల ఫీజికల్ డైరెక్టర్ అలీ తదితరులు పాల్గొన్నారు.