
ప్రజాశక్తి కదిరి టౌన్ : వాల్మీకి బోయలకు ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఉద్యమం ఆగదని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి పేర్కొన్నారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో ఆంధ్ర ప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో మంత్రాలయం నుండి అమరావతి వరకు తలపెట్టిన బైక్‌యాత్ర పుట్టపర్తి నుంచి నల్లమాడ మీదుగా కదిరికి ఆదివారం చేరుకుంది. రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి అధ్వర్యంలో వాల్మీకులు అధికసంఖ్యలో బైక్ యాత్రకు స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకి బోయలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని లేకపోతే భవిష్యత్తులో వారికి బుద్ధి చెప్తామనిఎపి వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు హెచ్చరించారు. బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీజాబితాలో చేర్చాలన్న డిమాండ్‌తో చేసే పోరాటంలో పార్టీలకతీతంగా ప్రతి వాల్మీకి సోదరుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎపివిబిఎస్ జిల్లా అధ్యక్షులు బోయ సాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శివ ప్రసాద్ , రాష్ట్ర యూత్ అధ్యక్షులు మహేష్ యువ, నాయకులు మోహన్, దొనకొండ ఆనంద్, చిన్న నరసింహులు, వాల్మీకి హరి, చలపతి, టి.ఆనంద్, ధనుంజయ, యువ నాయకులు రామాంజి, వీరనారప్ప, భార్గవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.