May 16,2022 13:17

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాల వద్ద సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలి గ్రామంలో హత్యకు గురైన వాలంటీర్‌ శారద కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి మార్చురీ ఎదుట బైఠాయించి సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్‌, సిపిఎం నాయకులు బొనిగల అగస్టీన్‌, తదితరులు నిరసన తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు.