Sep 13,2021 19:11

చిటపట చినుకు
మబ్బులన్నీ కదిలి
నేలరాలె చినుకు

మట్టివాసన రేపే
ముచ్చటైన చినుకు
తామరాకు పైన
ముత్యపు చినుకు

పడవలను నడిపించి
మురిపించే చినుకు
కేరింతలు పెట్టించే
చిట్టిపొట్టి చినుకు

వానపాటలు పాడించే
స్వచ్ఛమైన చినుకు
పిల్ల కాలువలలో
ప్రవహించే చినుకు

గంతులు వేయించే
గమ్మత్తయిన చినుకు
బడికి శెలవు ఇప్పించే చినుకు

- కయ్యూరు బాలసుబ్రమణ్యం
94417 91239